బుధవారం 27 మే 2020
International - May 02, 2020 , 13:10:17

క‌రోనా వైర‌స్ పుట్టుక స‌హ‌జ‌మైన‌దే..

 క‌రోనా వైర‌స్ పుట్టుక స‌హ‌జ‌మైన‌దే..


హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ పుట్టుక‌ స‌హ‌జ‌సిద్ద‌మైన‌ద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. డ‌బ్ల్యూహెచ్‌వో ఎమ‌ర్జెన్సీ చీఫ్ మైఖేల్ ర్యాన్ శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని తెలిపారు. వుహాన్ ల్యాబ్‌తో వైర‌స్‌కు లింకు ఉన్న‌ద‌ని ట్రంప్ వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ఆయ‌న ఈ స‌మాధానం ఇచ్చారు. నోవెల్ క‌రోనా వైర‌స్ జంతువుల నుంచి మ‌నుషుల‌కు సోకిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు న‌మ్ముతున్నార‌ని ర్యాన్ చెప్పారు.  వుహాన్‌లో ఉన్న స‌ముద్ర జీవుల ఆహార మార్కెట్ నుంచి వైర‌స్ వ్యాప్తి చెందిన‌ట్లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్న విష‌యం తెలిసిందే. 

క‌రోనా వైర‌స్ జ‌న్యు క్ర‌మాన్ని గుర్తించిన శాస్త్ర‌వేత్త‌లు అంద‌రూ అది స‌హ‌జ‌సిద్ద‌మైన‌దే అని పేర్కొన్న‌ట్లు ర్యాన్ తెలిపారు. ఇది స‌హ‌జ‌సిద్ద‌మైన వైర‌స్ అని స్ప‌ష్టం చేస్తున్న‌ట్లు మ‌రోసారి తెలిపారు. వైర‌స్‌కు నేచుర‌ల్ హోస్ట్ ఏంట‌న్న విష‌యాన్ని తాము నిర్దారించిన‌ట్లు చెప్పారు. అయితే జంతువుల నుంచి మ‌నుషుల‌కు ఎలా వైర‌స్ వ్యాపించింద‌న్న అంశాన్ని ఇంకా ప‌రిశీలించాల‌న్నారు. వైర‌స్ గురించి ప్ర‌పంచ‌దేశాల‌కు తెలియ‌జేసేందుకు తాము ఏ క్ష‌ణం కూడా ఆల‌స్యం చేయ‌లేద‌ని డైర‌క్ట‌ర్ టెడ్రోస్ తెలిపారు. logo