ఆదివారం 29 మార్చి 2020
International - Mar 16, 2020 , 02:02:00

వైరస్‌.. పశ్చిమ దేశాలకు దేవుడి శిక్ష

వైరస్‌.. పశ్చిమ దేశాలకు దేవుడి శిక్ష
  • జింబాబ్వే మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

హరారే: జింబాబ్వే రక్షణ మంత్రి ఒప్పా ముచింగూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారిని పశ్చిమ దేశాలపై దేవుడు విధించిన శిక్ష అని అభివర్ణించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ‘జింబాబ్వేపై ఆంక్షలు విధించిన అమెరికా, ఐరోపా దేశాలపై దేవుడు విధించిన శిక్షే ఈ కరోనా. ప్రస్తుతం ఆ దేశాల ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. మన దేశం మాదిరిగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కూలుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు గుణపాఠం చెబుతుంది. కరోనా ఫలితాలను వారు అనుభవించాలి. అప్పుడే మా బాధ అర్థమవుతుంది’ అని వ్యాఖ్యానించారు. 


logo