శనివారం 30 మే 2020
International - Apr 23, 2020 , 15:29:57

క‌రోనా వైర‌స్.. ప్ర‌జాస్వామ్యానికి పెను స‌వాల్‌

 క‌రోనా వైర‌స్.. ప్ర‌జాస్వామ్యానికి పెను స‌వాల్‌

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కోవ‌డం ప్ర‌జాస్వామ్యానికి పెద్ద స‌వాల్‌గా మారింద‌ని జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఏంజెలా మెర్క‌ల్ అన్నారు. బెర్లిన్‌లోని పార్ల‌మెంట్‌లో ఆమె ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఈయూ బ‌డ్జెట్‌కు భారీగా నిధుల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు.  యూరోప్ ఐక్యంగా ఉండేందుకు వైర‌స్ పెను స‌వాల్‌గా త‌యారైంద‌న్నారు.  ప్ర‌జ‌ల జీవితానికి, ఆరోగ్యానికి.. రెండో ప్ర‌పంచ యుద్ధ త‌ర్వాత ఎదురైన‌ అతిపెద్ద ఛాలెంజ్ ఇదే అన్నారు. అయితే వీలైనంత క్ర‌మ‌శిక్ష‌ణ పాటిస్తే, చాలా త్వ‌ర‌గా సుర‌క్షిత వాతావర‌ణానికి రాగ‌లుగుతామ‌న్నారు. స‌మ‌యాన్నివృధా చేయ‌రాద‌న్నారు. ఇత‌రుల‌పై ఆధార‌ప‌డ‌డం క‌న్నా..  ప్ర‌త్యేక మెడిక‌ల్ కిట్ల గురించి యూరోప్ దేశాలు సిద్ధం కావాల‌న్నారు.  మ‌రోవైపు ఈయూ నేత‌లు ఆయా దేశాల‌కు ఉద్దీప‌న ప్యాకేజీ ఇవ్వాల‌నుకుంటున్నారు. logo