శనివారం 11 జూలై 2020
International - Jun 12, 2020 , 00:57:17

రెండు నెలల తర్వాత బీజింగ్‌లో కేసు

రెండు నెలల తర్వాత బీజింగ్‌లో కేసు

బీజింగ్‌: చైనా రాజధాని బీజింగ్‌లో గురువారం కొత్త కరోనా కేసు నమోదైంది. రెండు నెలల అనంతరం నగరంలో కొత్త వైరస్‌ కేసు నమోదవ్వడం ఇదే తొలిసారి. మరోవైపు, వుహాన్‌లో గతేడాది ఆగస్టులోనే వైరస్‌ వ్యాప్తి జరిగిందని పేర్కొంటూ హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ వెల్లడించిన అధ్యయనాన్ని చైనా కొట్టిపారేసింది. ట్రాఫిక్‌ పరిమాణాన్ని విశ్లేషించి వైరస్‌ వ్యాప్తి జరిగి ఉండవచ్చని నిర్ధారణకు రావడం నిజంగా హాస్యాస్పదమన్నది. 

చైనా అధ్యక్షుడిపై బీహార్‌ లాయర్‌ ‘కరోనా కేసు’

కరోనా వ్యాప్తికి బాధ్యుడిని చేస్తూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌పై ఓ బీహార్‌ లాయర్‌ కేసు పెట్టారు. ఆ మహమ్మారి చైనా నుంచి ప్రపంచ దేశాలకు విస్తరించడానికి జిన్‌పింగ్‌తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ ప్రధాన కారణమని మురాద్‌ అలీ అనే న్యాయవాది ఆరోపించారు. ఈ మేరకు బీహార్‌లోని ఓ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

దక్షిణ కొరియాలో మళ్లీ వైరస్‌!

కరోనా కట్టడిలో ఇతరదేశాలకు అదర్శంగా నిలిచిన దక్షిణ కొరియాలో మళ్లీ వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. గురువారం కొత్తగా 45 కేసులు రికార్డయ్యాయి. ఈసారి సియోల్‌ కేంద్రంగా వైరస్‌ విజృంభించే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. logo