గురువారం 02 జూలై 2020
International - Jun 16, 2020 , 16:56:34

ఒమ‌న్‌లో విజృంభిస్తున్న క‌రోనా

ఒమ‌న్‌లో విజృంభిస్తున్న క‌రోనా

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా గల్ఫ్‌లో స్వైర విహారం చేస్తున్న‌ది. ఒమన్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి మంగళవారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే 745 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఒమన్‌లో క‌రోనా వైరస్ బారినపడ్డ వారి సంఖ్య 25,269కి చేరింది. ఇక తాజాగా నమోదైన 745 కొత్త కేసుల్లో 377 మంది ఒమన్ పౌరులు కాగా, 368 మంది విదేశీయులు ఉన్నార‌ని ఒమన్ ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. 

కాగా, సోమ‌వారం 1,556 మంది కరోనా బాధితులు వైర‌స్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఒమ‌న్‌లో ఇప్పటివరకు క‌రోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య‌ 11,089కి చేరింది. అదేవిధంగా ఒమ‌న్‌లో మ‌ర‌ణాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో ఆరు మరణాలు సంభవించడంతో  ఆ దేశంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 114కు చేరింది. 


logo