గురువారం 02 జూలై 2020
International - May 30, 2020 , 13:26:15

రష్యాలో కరోనా విలయం

రష్యాలో కరోనా విలయం

మాస్కో: యావత్‌ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది.  చాలా దేశాల్లో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. కరోనా బాధిత దేశాల్లో మూడో స్థానంలో ఉన్న రష్యాలో శనివారం  కొత్తగా 8,952  మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,96,575 చేరింది. గడచిన 24 గంటల్లో మరో  181 మంది చనిపోవడంతో  మొత్తం మరణాల సంఖ్య 4,555 పెరిగింది.  దేశరాజధాని మాస్కోలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. 


logo