ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 19, 2020 , 09:02:24

6 లక్షలు దాటిన కరోనా మరణాలు

6 లక్షలు దాటిన కరోనా మరణాలు

న్యూయార్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విళయతాండవం చేస్తున్నది. ఈ వైరస్‌ బారినపడి ఇప్పటివరకు ఆరు లక్షలకుపైగా జనాభా మృత్యువాతపడ్డారు. తాజాగా 2,17,257 మందికి కరోనా సోకడంతో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 14,424,525కు చేరింది. గత 24 గంటల్లో 5008 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 6,04,880కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 86,11,976 మంది కోలుకోగా, మరో 52,07,669 మంది చికిత్స పొందుతున్నారు. 

అమెరికాలో కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. నిన్న కొత్తగా 63,259 కేసులురాగా, 813 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 38,33,271కి చేరింది. కరోనా వైరస్‌తో 1,42,877 మంది మరణించారు. ఇక అత్యధిక కేసుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో తాజాగా 26,549 కేసులు నమోదవగా, 885 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు 20,75,246 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 78,817 మంది మరణించారు. భారత్‌లో 10,38,716 కేసులు నమోదవగా, 26,273 మంది మృతిచెందారు. 

ఇక నాలుగో స్థానంలో ఉన్న రష్యాలో 7,65,437 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 12,247 మంది మరణించారు. దక్షిణాఫ్రికాలో 3,50,879 మంది కరోనా బారినపడగా, 4948 మంది మరణించారు. మెక్సికోలో కరోనా కేసుల సంఖ్య 3,31,298కి చేరింది. కరోనాతో 38,310 మరణించారు. 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 6,04,880 మంది కరోనాతో చనిపోయారు. ఇందులో అత్యధికంగా అమెరికాలో 1,42,877 మంది చనిపోయారు. బ్రెజిల్‌లో 78,817మంది, మెక్సికో 38,310 మంది, యూకేలో 45,273 మంది, ఇటలీలో 35,042 మంది మరణించారు. జూన్‌ 28 తర్వాత అంటే గత మూడు వారాల్లో కొత్తగా లక్షమంది కరోనాతో మృతిచెందారు. ఐరాపాలో ఇప్పటివరకు 2,05,065 మంది చనిపోయారు. 

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ రికవరీల్లో భారత్‌ రెండో స్థానంలో ఉండగా, మొత్తం మరణాల్లో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నది. రోజువారి మరణాల్లో మాత్రం నాలుగో స్థానంలో ఉన్నది. భారత్‌కంటే ముందు బ్రెజిల్‌, అమెరికా, మెక్సికో దేశాలు ఉన్నాయి.


logo