బుధవారం 28 అక్టోబర్ 2020
International - Oct 13, 2020 , 12:19:38

ఫేస్‌మాస్క్ ధ‌రించిన విమానాలు.. అందుకేన‌ట‌!

ఫేస్‌మాస్క్ ధ‌రించిన విమానాలు.. అందుకేన‌ట‌!

క‌రోనా వైర‌స్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి శుభ్ర‌త ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించేవారు కూడా శుభ్ర‌త ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హిస్తున్నారు. శానిటైజ‌ర్‌, ఫేస్‌మాస్క్‌ల ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి అధికారులు చాలా ప్ర‌య‌త్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు విమానాల వంతు వ‌చ్చింది. ప్ర‌యాణం చేసే ప్ర‌తిఒక్క‌రూ మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా వాడండంటూ త‌న‌దైన స్టైల్‌లో అంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ది.

జాతీయ జెండా క్యారియర్ గరుడ ఇండోనేషియా గతవారం ఐదు విమానాలను ఫేస్‌మాస్క్‌లతో నింపేసింది. విమానాల ముక్కు భాగం వ‌ద్ద నీలిరంగులో మాస్క్‌ల‌ను పెయింట్ చేశారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయ‌డానికి 120 గంట‌ల‌కు పైగా ప‌ట్టింది. అంతేకాదు దీనికి 60 మంది ప‌నిచేశారు. కరోనావైరస్ మహమ్మారి నేపథ్యంలో, ప్ర‌తిఒక్క‌రూ ఫేస్‌మాస్క్‌లు ధరించాలనేది దీని ముఖ్య ఉద్దేశం. 


logo