సోమవారం 01 జూన్ 2020
International - Apr 16, 2020 , 01:50:12

2022 వరకు నిర్ణీత దూరం

2022 వరకు నిర్ణీత దూరం

  • పాటిస్తేనే వైరస్‌ నియంత్రణలోకి
  • హార్వర్డ్‌ స్కూల్‌ పరిశోధనలో వెల్లడి 

బోస్టన్‌: కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే ప్రపంచ దేశాల్లోని ప్రజలు 2022 నాటి వరకు నిర్ణీత దూరాన్ని పాటించాలని హార్వర్డ్‌ యూనివర్సిటీకి చెందిన హార్వర్డ్‌ టీ. హెచ్‌. చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు తెలిపారు. అత్యవసర వైద్య సదుపాయాలు తగిన స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు లేదా వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్‌ను కనుగొనే వరకూ ఇదే మార్గమని అభిప్రాయపడ్డారు. ఈ వివరాలు ‘జనరల్‌ సైన్స్‌'లో ప్రచురితమయ్యాయి. అమెరికాలో వైరస్‌ సంక్రమణ జరిగిన విధానం, కేసుల సమాచారాన్ని సేకరించి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అక్కడక్కడ వెలుగుచూసిన వైరస్‌.. క్రమంగా మహమ్మారిగా విస్తరించిందని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న ప్రపంచ వైద్య వ్యవస్థ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే.. వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోకి రావాలంటే 2022 వరకు వేచి చూడాలని, ఇది జరుగాలంటే ప్రజలందరూ నిర్ణీత దూరాన్ని పాటించాలన్నారు. వైరస్‌ను నయం చేసే టీకాను అభివృద్ధి చేసి, పరీక్షలు జరిపి అందుబాటులోకి తీసుకురావాలంటే సంవత్సరాల కాలం పట్టొచ్చని, అప్పటివరకూ నిర్ణీత దూరాన్ని పాటించడమే వైరస్‌ నియంత్రణకు ఉత్తమ మార్గమని తెలిపారు. 


logo