గురువారం 03 డిసెంబర్ 2020
International - Nov 01, 2020 , 17:54:36

మాస్కును ఇలా వాడండి: డబ్ల్యూహెచ్‌వో వీడియో..

మాస్కును ఇలా వాడండి: డబ్ల్యూహెచ్‌వో వీడియో..

జెనీవా: కొవిడ్‌-19 విజృంభణ నెమ్మదించినా రెండో వేవ్‌ వచ్చే అవకాశముందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని ఎదుర్కోవాలంటే ప్రస్తుతం మన దగ్గరున్న అస్త్రాలు రెండే. ఒకటి మాస్కు.. రెండు భౌతికదూరం.. అయితే, చాలామంది కొవిడ్‌ వ్యాప్తి తగ్గిపోయిందని మాస్కును పక్కన పడేశారు. కొంతమంది తూతూమంత్రంగా వాడుతున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మాస్కును ఎలా వాడాలి? ఎలాంటి పొరపాట్లు చేయొద్దు..? అనేవాటిపై హెచ్చరికలు జారీచేసింది. ఫ్యాబ్రిక్‌ మాస్కులను ఎలా వాడాలో మరోసారి సూచించింది. మాస్కులను సురక్షితంగా వాడకుంటే ప్రమాదం కొనితెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తోంది. మాస్కులను ఎలా వాడాలో సూచిస్తూ డబ్ల్యూహెచ్‌వో ఓ వీడియో కూడా విడుదల చేసింది. 

డబ్ల్యూహెచ్‌వో సూచనలివే..

  1. మాస్కును తలకిందులుగా పెట్టుకోవద్దు.
  2. వదులుగా ఉండకుండా చూసుకోవాలి.  
  3. మాస్కు ముక్కు,నోటిభాగాలను కప్పేలా ఉండాలి. కిందికి తీసుకురాకూడదు.
  4. మాట్లాడేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ మాస్క్‌ తీయొద్దు.
  5. మాస్కు ముందుభాగాన్ని చేతితో తాకరాదు. పైకి,కిందికి కదపొద్దు.
  6. ఇతరులు వాడిన మాస్కులు వాడొద్దు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.