బుధవారం 03 జూన్ 2020
International - May 15, 2020 , 19:20:44

ప్రపంచవ్యాప్తంగా కరోనా మ‌ర‌ణాలు @ 3,02,493

ప్రపంచవ్యాప్తంగా కరోనా మ‌ర‌ణాలు @ 3,02,493

లండన్‌: కరోనా విలయ తాండవంలో ప్రపంచవ్యాప్తంగా  మరణాల సంఖ్య 3 లక్షలు దాటింది. శుక్రవారం సాయంత్రం నాటికి కరోనా వల్ల 3,02,493 మంది చనిపోయారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 44,44,670 మందికి కరోనా సోకింది.  అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాలో 85,906 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ సడలించగానే కొత్తకేసులు భారీగా పెరుగుతున్నాయి.   ఆంక్షలు సడలించిన తర్వాత కూడా కొన్ని దేశాల్లో  కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 

కరోనా మరణాలు ఎక్కువగా ఉన్న దేశాలివే..

అమెరికా(85,906 మరణాలు)

బ్రిటన్‌(33,693)

ఇటలీ(31,368)

ఫ్రాన్స్‌(27,428 )

స్పెయిన్‌(27,321)

బ్రెజిల్‌(13,999)

బెల్జియం(8,903 )

జర్మనీ(7,884 )


logo