బుధవారం 03 జూన్ 2020
International - Apr 02, 2020 , 07:44:44

యూఎస్‌లో 24 గంటల్లో 884 మంది మృతి

యూఎస్‌లో 24 గంటల్లో 884 మంది మృతి

వాషింగ్టన్‌ : అమెరికాలో కరోనా వైరస్‌ మరణ మృదంగం మోగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 884 మంది మృతి చెందినట్లు జాన్స్‌ హాఫ్‌కిన్స్‌ యూనివర్సిటీ బుధవారం సాయంత్రం వెల్లడించింది. ఇప్పటి వరకు అమెరికాలో ఈ వైరస్‌ బారిన పడి 5,110 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 25,200 కేసులు నమోదు కాగా, మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,15,175కు చేరుకుంది. మార్చి 27న ఇటలీలో 969 మంది కరోనాతో చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 9,35,840 నమోదు అయ్యాయి. 47,241 మంది మృతి చెందారు. అత్యధికంగా ఇటలీలో 13,155 మంది ప్రాణాలు కోల్పోయారు.


logo