ఆదివారం 29 మార్చి 2020
International - Mar 13, 2020 , 18:09:33

కరోనా రికార్డ్‌.. 5 వేలు దాటిన మృతుల సంఖ్య

కరోనా రికార్డ్‌.. 5 వేలు దాటిన మృతుల సంఖ్య

హైదరాబాద్‌ : చైనాలో ప్రబలిన కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా విజృంభించింది. కరోనా వైరస్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5,043 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య లక్షా 36 వేల 385 మందికి చేరింది. చైనాలో 3,177 మంది, ఇటలీలో 1,016, ఇరాన్‌లో 429, దక్షిణ కొరియాలో 71, స్పెయిన్‌లో 90, ఫ్రాన్స్‌లో 61, అమెరికాలో 41కి కరోనా మృతుల సంఖ్య చేరింది. గతేడాది డిసెంబర్‌లో చైనాలో ప్రబలిన ఈ వైరస్‌ 121 దేశాలకు సోకింది.

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 81కి చేరినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ వైరస్‌ బారిన పడి కర్ణాటకలో 76 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇక కరోనాపై ఐక్య పోరాటానికి ప్రధాని నరేంద్ర మోదీ సార్క్‌ దేశాలకు పిలుపునిచ్చారు. మోదీ ప్రతిపాదనకు సార్క్‌ దేశాలు మద్దతు ప్రకటించాయి. కరోనా నియంత్రణకు కలిసికట్టుగా శ్రమిద్దామని సార్క్‌ దేశాలు పేర్కొన్నాయి.


logo