ఆదివారం 31 మే 2020
International - Apr 02, 2020 , 18:20:12

బెల్జియంలో 1000 ధాటిన కరోనా మృతుల సంఖ్య

బెల్జియంలో 1000 ధాటిన కరోనా మృతుల సంఖ్య

బ్రస్సెల్స్‌:  కరోనా వైరస్‌ ప్రభావంతో పశ్చిమ ఐరోపా దేశమైన బెల్జియం వణికిపోతున్నది. బెల్జియంలో కరోనా ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 1000 కి చేరుకుంది. 1.14 కోట్ల జనాభా ఉన్న బెల్జియంలో ఇప్పటివరకు 15,348 కేసులు నమోదవగా..కరోనా బారిన పడి 1011 మంది మృతి చెందారు. మృతుల్లో 93 శాతం మంది 65 ఏళ్లకు పైబడినవారేనని బెల్జియం వైద్యారోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎమ్మాన్యుయేల్‌ ఆండ్రే తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బెల్జియం దేశమంతటా లాక్‌ డౌన్‌ ప్రకటించింది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు. 


logo