శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 24, 2020 , 16:13:36

1.9 లక్షల కరోనా మరణాలు..అత్యధికంగా యూఎస్‌లో..

1.9 లక్షల కరోనా మరణాలు..అత్యధికంగా యూఎస్‌లో..

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడి మృతిచెందిన వారిసంఖ్య 1,90,000 దాటింది. అన్ని దేశాల్లో కలిపి శుక్రవారం నాటికి మరణాల సంఖ్య 190,089కు చేరిందని జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ తెలిపింది. మూడింట రెండొంతుల మరణాలు ఒక్క యూరప్‌ ఖండంలోనే సంభవించాయి.  చైనాలో  డిసెంబర్‌లో మొదటగా కోవిడ్‌-19 మహమ్మారి వెలుగులోకి రాగా ఇవాళ్టి వరకు 2,698,733 మందికి వైరస్‌ సోకింది.  

వైరస్‌ ధాటికి అత్యధికంగా అగ్రరాజ్యం అమెరికాలో 49,963 మంది మృత్యువాత పడగా..ఇటలీ(25,549), స్పెయిన్‌(22,157), ఫ్రాన్స్(21,856)‌, బ్రిటన్‌( 18,73) దేశాల్లో ఎక్కువగా కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. 


logo