శనివారం 06 జూన్ 2020
International - Apr 10, 2020 , 10:27:36

ల‌క్ష చేరువ‌లో క‌రోనా మృతుల సంఖ్య..

ల‌క్ష చేరువ‌లో క‌రోనా మృతుల సంఖ్య..

హైద‌రాబాద్: నోవెల్ క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ వ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 95,718కి చేరుకున్న‌ది. ఆ వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 16 లక్ష‌లు దాటిన‌ట్లు అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ పేర్కొన్న‌ది.  ఇక ఈ వైర‌స్ వ‌ల్ల ఇండియాలో మృతిచెందిన వారి సంఖ్య 199గా ఉంది.  భార‌త్‌లో వైర‌స్ సంక్ర‌మించిన వారు 6వేలు దాటారు. అత్య‌ధికంగా మ‌హారాష్ట్ర‌లో 1364 మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. 

ఇక అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16వేలు దాటింది. మ‌హ‌మ్మారి క‌రోనా ఆ దేశంలో సుమారు 4.6 ల‌క్ష‌ల మందికి సోకింది. దీంతో ఆ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్న‌మైంది. కేవ‌లం మూడు వారాల్లోనే సుమారు కోటిన్న‌ర మంది ఉద్యోగాలు కోల్పోయారు. వైర‌స్ వ‌ల్ల ఇట‌లీలో  18,279 మంది,  స్పెయిన్‌లో 15,447 మంది,  ఫ్రాన్స్‌లో 12,210 మంది,  బ్రిట‌న్‌లో 7,978 మంది మ‌ర‌ణించారు.  చైనాలో కొత్త‌గా క‌రోనా వైర‌స్ కేసులు 42 న‌మోదు అయ్యాయి.  దాంట్లో విదేశాల నుంచి వ‌చ్చిన వారి సంఖ్య 38గా ఉంది. ఆ దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 81 వేలు దాటింది.

అత్య‌ధిక పాజిటివ్ కేసులు న‌మోదు అయిన దేశాల్లో అమెరికా (465,329), స్పెయిన్‌ (153,222), ఇట‌లీ (143,626), ఫ్రాన్స్‌ (118,783), జ‌ర్మ‌నీ (118,235), చైనా (82,885), ఇరాన్ (66,220), బ్రిట‌న్ (65,872) ఉన్నాయి. అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ నుంచి కోలుకున్న‌వారి సంఖ్య మూడున్న‌ర ల‌క్ష‌ల‌కు చేరుకున్న‌ది.  
logo