సోమవారం 30 మార్చి 2020
International - Feb 06, 2020 , 13:59:08

కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 560

కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 560

హుబే : చైనాలో రోజురోజుకు కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. చైనాలో కరోనా వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 560 మంది మృతి చెందారు. హుబే రాష్ట్రంలో మరో 70 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కేంద్రమైన హుబేలో కొత్తగా 2,987 కేసులు నమోదు అయ్యాయి. చైనాలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 27,378 దాటింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చైనా అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు 100 మిలియన్ డాలర్ల విరాళాన్ని మిరిండా గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది.  వివిధ దేశాల్లో కరోనా వ్యాధి కేసులు 182కి పెరిగాయి. ఫిలిప్పైన్స్‌లో తొలి మరణం నమోదైంది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమై నివారణ చర్యలు తీసుకుంటున్నాయి. చైనా నుంచి ఇండియాకు వస్తున్న వారికి ఆయా ఎయిర్ పోర్టుల్లో వైద్యులు స్ర్కీనింగ్ చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులను వైద్యులు.. ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి అబ్జర్వేషన్ చేస్తున్నారు. 


logo