గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 03, 2020 , 10:10:16

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు 3,122

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు 3,122

హైదరాబాద్‌ : ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకు 3,122 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ బారిన పడి వారి సంఖ్య 90,823కి చేరింది. ఒక్క చైనాలోనే 2,943 మంది మృతి చెందారు. ఈ వైరస్‌ నుంచి కోలుకున్న 47,204 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈయూ దేశాల్లో 38 మంది మృతి చెందగా, ఇరాన్‌లో మృతుల సంఖ్య 66కి, ఇటలీలో మృతుల సంఖ్య 52కి చేరింది. దక్షిణ కొరియాలో ఒక్క రోజులోనే 500 కొత్త కేసులు బయటపడ్డాయి. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు అన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. 

వ్యాక్సిన్‌ను కొనగలమా?

కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ మరో 90 రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని ఇటీవల ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే దీన్ని కొనుగోలు చేసే తాహతు ఎంతమందికి ఉండబోతుందోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై అమెరికా మానవ ఆరోగ్య సేవల విభాగం కార్యదర్శి అలెక్స్‌ స్పందించారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసే సామర్థ్యం అమెరికన్లకు లేదని చెప్పారు. ప్రైవేటు ఫార్మా సంస్థలు దీన్ని అభివృద్ధి చేస్తే టీకా ఖరీదు అంచనాలకు మించి ఉంటుందన్నారు. తలసరి ఆదాయం(అంచనా) 57,379డాలర్లు (రూ.42,13,504)గా ఉన్న అమెరికన్‌ పరిస్థితే ఇలా ఉంటే మిగతా వాళ్ల సంగతేంటని పలువురు వాపోతున్నారు. 


logo