ఆదివారం 31 మే 2020
International - May 02, 2020 , 16:44:37

స్పెయిన్‌లో 25వేలు దాటిన మరణాలు

స్పెయిన్‌లో 25వేలు దాటిన మరణాలు

మాడ్రిడ్‌:  కరోనా వైరస్‌ విలయతాండవం స్పెయిన్‌ను అతలాకుతలం చేస్తోంది.  ఆదేశంలో ప్రతిరోజు కనీసం వెయ్యికిపైనే కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శనివారం కొత్తగా 1,366 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 216,582కు పెరిగింది.  గడచిన 24 గంటల్లో 276 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు స్పెయిన్‌లో కరోనా వల్ల 25,100 మంది చనిపోయారు. శనివారం వరకు  రికార్డు స్థాయిలో 117,248 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న ఒక్కరోజే 2,570 కోలుకున్నారు.  ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా సంభవించిన   మరణాల్లో మూడింట రెండొంతులు   ఒక్క  యూరప్‌లోనే చోటు చేసుకున్నాయి.  


logo