శనివారం 28 మార్చి 2020
International - Mar 23, 2020 , 17:31:00

ఇరాన్‌లో 1812కు చేరిన మృతుల సంఖ్య‌

ఇరాన్‌లో 1812కు చేరిన మృతుల సంఖ్య‌

హైద‌రాబాద్‌: ఇరాన్‌లో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 1812కు చేరుకున్న‌ది. ఈ విష‌యాన్ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ అధికారి కియ‌నోష్ జ‌హాన్‌పూర్ తెలిపారు.  దేశంలో మొత్తం 23 వేల 49 మందికి క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  దాంట్లో సుమారు 9 వేల మందికి క‌రోనా న‌య‌మైంది. నిన్న‌టి నుంచి 1411 కొత్త కేసుల‌ను న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. గ‌త 24 గంట‌ల్లో 127 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  దేశ‌వ్యాప్తంగా దాదాపు 36 మిలియ‌న్ల మందిని క‌రోనా స్క్రీనింగ్ చేసిన‌ట్లు తెలిపారు. 

 logo