గురువారం 09 ఏప్రిల్ 2020
International - Feb 17, 2020 , 09:06:25

1770కి చేరిన కరోనా వైరస్‌ మృతుల సంఖ్య

1770కి చేరిన కరోనా వైరస్‌ మృతుల సంఖ్య

బీజింగ్‌ : చైనాలో రోజురోజుకు కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కోవిద్‌-19 వైరస్‌తో ఇప్పటి వరకు 1770 మంది మృతి చెందారు. హుబే ప్రావిన్స్‌లో ఒక్క రోజులోనే 100 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో కొత్తగా 2018 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తంగా కోవిద్‌-19 వైరస్‌ బాధితుల సంఖ్య 70,548కి చేరింది. ఈ వ్యాధితో ఆస్పత్రుల్లో చేరి కోలుకున్న తర్వాత 10,844 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు చైనా అధికారులు బహిరంగ ప్రదేశాల్లో ఆంక్షలు విధించారు. 


logo