గురువారం 09 జూలై 2020
International - May 26, 2020 , 19:53:57

56 లక్షలు దాటిన కరోనా కేసులు

56 లక్షలు దాటిన కరోనా కేసులు

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా  మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం వరకు కేసుల సంఖ్య 56,18,126కు చేరింది.  అగ్రరాజ్యం అమెరికాలో అత్యధికంగా 17,08,473 కరోనా కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్‌లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్‌-19 విజృంభణ ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. రష్యాలోనూ వైరస్‌ విస్తరిస్తోంది.  కరోనా మహమ్మారి వల్ల ఈ మూడు దేశాల్లో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరల్డ్‌వైడ్‌గా ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య  3,48,545కు చేరింది. 

కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితా ఇదే..

అమెరికా(1,708,473 కేసులు)

బ్రెజిల్‌(376,669)

రష్యా(362,342)

స్పెయిన్‌(282,480)

బ్రిటన్‌(261,184)

ఇటలీ(230,158)

ఫ్రాన్స్‌(182,942)

జర్మనీ(180,830)

టర్కీ(157,814)

భారత్‌(147,144)


logo