సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Mar 27, 2020 , 14:04:34

న్యూయార్క్‌లో మరణ మృదంగం

న్యూయార్క్‌లో మరణ మృదంగం

కరోనా రక్కసికి అగ్రరాజ్యం విలవిలలాడుతుంది. ఒక్కో రోజులో 10-12 వేల కొత్త కేసులు నమోదవుతుండగా... మృతుల సంఖ్య కూడా అదేరీతిన పెరుగుతుంది. ముఖ్యంగా అమెరికాలోని న్యూయార్క్‌లో మరణమృదంగం మోగుతుంది. మొత్తం అమెరికాలో ఇప్పటివరకు 1300 కరోనా మరణాలు నమోదు కాగా.. అందులో ఏకంగా 36 శాతం అంటే 466 మరణాలు కేవలం న్యూయార్క్‌లోనే నమోదయ్యాయి. ఆతర్వాత న్యూజెర్సీ కోవిడ్‌-19 బారినపడి అల్లాడుతుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు అమెరికా వ్యాప్తంగా ఇప్పటికే (భారత కాలమాన ప్రకారం శుక్రవారం ఉదయం 11 గంటలు) 159 కొత్త కేసులు నమోదు కాగా ఐదు మరణాలు సంభవించాయి. తాజాగా టెక్సాస్‌లో అత్యధికంగా 74 కొత్త కేసులతో పాటు మూడు మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో అగ్రరాజ్యంలో కరోనా బాధితుల సంఖ్య 85,595కు చేరగా... ఒక్క న్యూయార్క్‌లోనే 38,957 దాదాపు 45 శాతం నమోదు కావడం అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. logo