ఆదివారం 31 మే 2020
International - May 12, 2020 , 09:04:27

ప్రపంచవ్యాప్తంగా 42.5 లక్షల కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా 42.5 లక్షల కరోనా కేసులు

పారిస్‌: ప్రపంచంలో కరోనా వైరస్‌ విళయతాండవం చేస్తున్నది. అమెరికాలో గత మూడు రోజులుగా కరోనా మరణాలు తగ్గుతున్నప్పటికీ, రష్యా, బ్రెజిల్‌ దేశాల్లో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. కరోనా కేసుల్లో రష్యా ఇప్పటికే ఇటలీని దాటివేయగా, బ్రెజిల్‌ ఎనిమిదో స్థానానికి దూసుకువచ్చింది. ఇలా ప్రపంచంలో ఇప్పటివరకు 42,54,800 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,87,293 మంది వైరస్‌ ప్రభావంతో మృతిచెందారు. అన్ని దేశాల్లో కలిపి ఇంకా 24,40,363 కేసులు యాక్టివ్‌గా ఉండగా, ప్రాణాంతక వైరస్‌ బారిన పడిన 15,27,144 మంది కోలుకుని డిశార్జి అయ్యారు. 

ఇక దేశాల వారీగా చూస్తే కరోనా కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. దేశంలో ఇప్పటివరకు 13,85,834 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో గత 24 గంటల్లో ఈ మహమ్మారి వల్ల 830 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 81,795కు పెరిగింది. మరో 10,41,814 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 2,62,225 మంది బాధితులు ఈ వైరస్‌ నుంచి కోలుకున్నారు. రెండో స్థానంలో ఉన్న స్పెయిన్‌లో 2,68,143 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 26,744 మంది మృతిచెందారు. యూకేలో కరోనా కేసుల సంఖ్య 2,23,060కి చేరింది. ఇక్కడ ఇప్పటివరకు 32,065 మంది మరణించారు. 

అత్యధిక కేసులు నమోదవుతున్న రష్యా తాజాగా ఇటలీ వెనక్కి నెట్టి, యూకేకి చేరువలో నిలిచింది. రష్యాలో ఇప్పటివరకు 2,21,344 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ ప్రాణాంతక మహమ్మారి వల్ల ఇప్పటివరకు 2009 మంది బాధితులు మృతిచెందారు. 1,79,534 కేసులు యాక్టివ్‌గా ఉంగా, 39,801 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ఇటలీలో కోరోనా కేసుల సంఖ్య 2,19,814కి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు 30,739 మంది మరణించారు. ఫ్రాన్స్‌ కరోనా వైరస్‌తో నిన్న ఒక్కరోజే 263 మంది బాధితులు మరణించారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 26463కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 1,77,423 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


logo