గురువారం 28 మే 2020
International - Apr 18, 2020 , 11:33:35

అమెరికాలో ఏడు లక్షలు దాటిన కరోనా కేసులు

అమెరికాలో ఏడు లక్షలు దాటిన కరోనా కేసులు

వాషింగ్టన్‌: ప్రపంచ ఆర్థిక రాజధాని కరోనా వైరస్‌కు ప్రధానంగా మారింది. రెండు లక్షలకు పైగా జనాభా ఈ మహమ్మారి బారిన పడగా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రభావంతో 14 వేల మందికి పైగా మరణించారు. న్యూయార్క్‌ పక్కనే ఉన్న న్యూజెర్సీ కూడా కరోనాతో విలవిలాడుతున్నది. ఆ రాష్ట్రంలో 78 వేల కేసులు నమోదుకాగా, 3800 మంది మరణించారు. మొత్తంగా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్లక్ష్య వైఖరితో అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటున్నది. ఇప్పటివరకు అగ్రరాజ్యంలో ఏడు లక్షలకు పైగా జనాభా కరోనా పాజిటివ్‌లుగా తేలగా, ఇప్పటికే 35 వేల మందికిపైగా మరణించారు.


logo