ఆదివారం 12 జూలై 2020
International - Jun 28, 2020 , 14:30:11

జర్మనీలో 1,93,499కి చేరిన కరోనా కేసులు

జర్మనీలో 1,93,499కి చేరిన కరోనా కేసులు

బెర్లిన్‌ : జర్మనీ గత 24గంటల్లో 256 కరోనా కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. మొత్తం పాజిటివ్‌ కేసులు 1,93,499కి చేరాయని రాబర్ట్ కోచ్ ఇనిస్టిట్యూట్ ఆదివారం పేర్కొంది. ఇప్పటి వరకు 8,957 మంది వరకు మృతి చెందారు. వైరస్‌ బారి నుంచి1,77,700 మంది కోలుకున్నారని వివరించింది. శనివారం దేశవ్యాప్తంగా 687 కొత్త కేసులు నమోదవగా, ఆరుగురు మృతి చెందారు. బవేరియాలో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు 48,294 నమోదు కాగా, ఆ తర్వాత రైయిన్‌ వెస్ట్‌ ఫాలియాలో 42,723, బాడెన్‌ వుర్టెమ్బెర్గ్‌లో 35,530 వరకు నమోదయ్యాయి. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఇప్పటి వరకు 8,168 కేసులు గుర్తించినట్లు రాబర్ట్‌ కోచ్‌ ఇనిస్టిట్యూట్‌ వివరించింది.


logo