ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Sep 10, 2020 , 10:49:06

మెద‌డులో క‌రోనా వ‌ల్లే.. త‌లనొప్పి, మ‌తిమ‌రుపు !

మెద‌డులో క‌రోనా వ‌ల్లే.. త‌లనొప్పి, మ‌తిమ‌రుపు !

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ బ్రెయిన్‌ను డ్యామేజ్ చేయ‌గ‌ల‌దు. మెద‌డులోకి ప్ర‌వేశించి ఆ ప్రాంతాన్ని బ్లాక్ చేసేస్తుంది. బ్రెయిన్‌లో ఉన్న ఆక్సిజ‌న్ క‌ణాల‌ను ఆ వైర‌స్ చుట్టుముట్టేస్తుంది. దీని వ‌ల్లే కోవిడ్‌19 రోగుల్లో త‌ల‌నొప్పి, గంద‌ర‌గోళం, మ‌తిమ‌రుపు లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించే అవ‌కాశాలు ఉన్నాయి. మెద‌డుపై వైర‌స్ తీవ్ర ప్ర‌భావం చూపనున్న‌ట్లు తాజాగా అమెరికాకు చెందిన ప‌రిశోధ‌కులు గుర్తించారు.  వారి అధ్య‌య‌నం ఇంకా పూర్తికాక‌పోయినా.. వారి అంచ‌నాలు మాత్రం దాదాపు అలాగే ఉన్నాయి.  యేల్ ఇమ్యూనాల‌జిస్ట్ అఖికో ఇవాసాకి దీనిపై త‌న నివేదిక‌ను ప్ర‌చురించారు. మెద‌డులో క‌రోనా వైర‌స్ వృద్ధి చెందుతుంద‌ని ఆ డాక్ట‌ర్ తేల్చారు. బ్రెయిన్‌లో ఉన్న ఆక్సిజ‌న్ క‌ణాల‌పై ఆ వైర‌స్ ఆధార‌ప‌డుతుంద‌ని గుర్తించారు.  కాలిఫోర్నియా వ‌ర్సిటీ న్యూరాల‌జీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెస‌ర్ ఆండ్రూ జోసెఫ్‌స‌న్ ఈ అధ్య‌యం కోసం వాడిన టెక్నిక్‌ను మెచ్చుకున్నారు. మెద‌డుకు రక్త ప్ర‌స‌ర‌ణ‌ను అడ్డుకునే సామ‌ర్థ్యం SARS-CoV-2 వైర‌స్‌కు ఉన్న‌ట్లు ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు. మెద‌డులోని ర‌క్త‌క‌ణాల‌ను చుట్టుముట్టిన వైర‌స్‌.. ఇత‌ర ప‌దార్థాలు రాకుండా అడ్డుకుంటుందంటున్నారు. జికా వైర‌స్ కూడా ఇలాంటి ప్ర‌భావాన్ని చూపిన‌ట్లు ప‌రిశోధ‌కులు పేర్కొంటున్నారు.

ఇవా‌సాకితో పాటు ఇత‌ర ప‌రిశోధ‌కులు SARS-CoV-2 వైర‌స్ స్ట‌డీ కోసం ఎలుక‌ల్లో బ్రెయిన్ ఆర్గ‌నాయిడ్స్‌ను ఎక్కించి ప‌రీక్షించారు. బ్రెయిన్ ఆర్గ‌నాయిడ్స్‌లో SARS-CoV-2 వైర‌స్ న్యూరాన్లకు సోకి ఆ త‌ర్వాత ఆ వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీసిన‌ట్లు గుర్తించారు. వైర‌స్ సోకిన ఇత‌ర క‌ణాలు.. మెద‌డులోకి ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను అడ్డుకున్న‌ట్లు ప‌సిక‌ట్టారు. వాస్త‌వానికి బ్రెయిన్‌లో ఏసీఈ2 ప్రోటీన్ ఉండ‌ద‌ని, అందుకే వైర‌స్ అక్క‌డ ఆక్ర‌మ‌ణ చేయ‌ద‌న్న అభిప్రాయం ఉండేది. కానీ మెద‌డు సమీపంలో ఉన్న ఇత‌ర అవ‌య‌వాల్లో ఉన్న ఏసీఈ2 ప్రోటీన్లు వైర‌స్‌కు ఎంట్రీ క‌ల్పిస్తున్నాయ‌ని ప‌రిశోధ‌కులు గుర్తించారు.  కోవిడ్ వ‌ల్ల చ‌నిపోయిన చాలా మంది మెద‌డు క‌ణ‌జాలంలో ఆ ప్రోటీన్ల‌ను గుర్తించిన‌ట్లు ప‌రిశోధ‌కులు చెప్పారు. ఊపిరితిత్తుల క‌న్నా.. మెద‌డులోకి వైర‌స్ ప్ర‌వేశించిన వారే తొంద‌ర‌గా ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ప‌రిశోధ‌కులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. అయితే ఈ స్ట‌డీపై లోతైన అధ్య‌య‌నం చేయాల్సి ఉంద‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. 


logo