సోమవారం 01 జూన్ 2020
International - May 21, 2020 , 00:59:08

చైనాలో కరోనా రూపాంతరం!

చైనాలో కరోనా రూపాంతరం!

  • ఉత్తర ప్రాంతాల్లో భిన్నమైన వైరస్‌ 

బీజింగ్‌: కరోనా వైరస్‌ రూపాంతరం చెందుతున్నదా? వేర్వేరు ప్రాంతాల్లో భిన్నమైన ప్రభావాన్ని చూపిస్తున్నదా? చైనాలో నమోదవుతున్న కొత్త కేసుల్ని పరిశీలిస్తే ఇది నిజమేననిపిస్తున్నది. ఆ దేశంలోని ఉత్తరాది రాష్ర్టాల్లో ఇటీవల నమోదవుతున్న కొత్త కేసులు.. వుహాన్‌లో నమోదైన కేసులతో పోలిస్తే భిన్నమైన లక్షణాల్ని కలిగి ఉన్నాయని చైనా వైద్యులు చెబుతున్నారు. జిలిన్‌, హెయిలాంగ్‌జియాంగ్‌ రాష్ర్టాల్లో ఇటీవల వెలుగుచూసిన కేసులను పరిశీలిస్తే.. రోగుల్లో వైరస్‌ లక్షణాలు బయటపడటానికి గతంలో కంటే ఎక్కువ సమయం పడుతున్నదని, అలాగే రోగులు వ్యాధి నుంచి కోలుకోవడానికి పట్టే వ్యవధి కూడా ఎక్కువగా ఉంటున్నట్టు చైనా వైద్య నిపుణుడు క్యూ హైబో తెలిపారు. ఈశాన్య ప్రాంతాల్లో కొత్త వైరస్‌ సోకిన రోగుల్లో ఊపిరితిత్తులపై ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తాము గమనించామన్నారు. అయితే, వుహాన్‌లో వెలుగుచూసిన కేసుల్లోని బాధితుల గుండె, మూత్రపిండాలు, ఆంత్రము (చిన్న పేగు, పెద్ద పేగు) వంటి పలు అవయవాలపై వైరస్‌ ప్రభావం చూపించిందని చెప్పారు. రష్యా నుంచి దేశంలోకి వస్తున్న వారి వల్లే ఈ రకమైన కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. 


logo