శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Mar 05, 2020 , 01:12:42

‘నమస్తే’ను ఫాలో అవ్వండి

‘నమస్తే’ను  ఫాలో అవ్వండి
  • ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ సలహా

జెరూసలేం, మార్చి 4: ఇతరులను కలిసినప్పుడు కరచాలనం చేయడాన్ని కొన్ని రోజులపాటు విడిచిపెట్టాలని.. భారత ప్రజలు పలకరింపులకు వాడే ‘నమస్తే’ విధానాన్ని పాటించాలని తమ దేశ ప్రజలకు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెత న్యాహూ సలహానిచ్చారు. కరోనాను నియంత్రించడంలో భాగంగా ఆయన ఈ సూచనలు చేశారు. కాగా ఇప్పటి వరకూ ఆ దేశంలో 15 కరోనా కేసులు నమోదయ్యాయి. logo