బుధవారం 03 జూన్ 2020
International - Apr 30, 2020 , 13:32:12

30.5 కోట్ల ఉద్యోగాల‌పై క‌రోనా ప్ర‌భావం

30.5 కోట్ల ఉద్యోగాల‌పై క‌రోనా ప్ర‌భావం

క‌రోనా మ‌హ‌మ్మారితో  ప్ర‌పంచ వ్యాప్తంగా ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో  పరిశ్రమలు, కంపెనీలు మూతపడడం ఉద్యోగ రంగాన్ని కోలుకోకుండా చేస్తోంది. ఈ క్ర‌మంలో పెద్ద‌సంఖ్య‌లో వీధినపడేది ఉద్యోగులేనన్న నివేదికలు ఎప్పటి నుంచో వెలుగు చూస్తున్నాయి. అయితే, ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తాజాగా విడుదల చేసిన నివేదిక మరింత భ‌యాన్ని నెల‌కొల్పేలా ఉంది. ఐక్య‌రాజ్య‌స‌మితి నివేదికల ప్రకారం లాక్ డౌన్ ప్రభావం కనీసం 30 కోట్ల మందిపై  ప్రభావం ఉండబోతున్నట్టు చెప్తున్నాయి.  ఆఫ్రికా, అమెరికాలో 80శాతం, యూరప్, సెంట్రల్ ఆసియాలో 70శాతం, 21.6 శాతం ఆసియా, పసిఫిక్ రీజియన్ పై ఉంటుందని నివేదికలు చెప్తున్నాయి.  అమెరికాలో ఇప్పటికే కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్న‌ట్లు అక్క‌డి ప్ర‌భుత్వం కూడా తేల్చింది.logo