గురువారం 28 మే 2020
International - Apr 13, 2020 , 19:22:18

గుట్టలు గుట్టలుగా కరోనా శవాలు, సామూహిక దహనాలు

గుట్టలు గుట్టలుగా కరోనా శవాలు, సామూహిక దహనాలు

కరోనా మహమ్మారి ప్ర‌పంచ దేశాల‌ను వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్ప‌టికే  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19లక్షలకు క‌రోనా బాధితుల సంఖ్య చేరుకుంటుంది.  లక్షా 14వేల మందిని బ‌లితీసుకుంది. ఇక ప్ర‌పంచ పెద్ద‌న్న‌గా భావించుకునే అమెరికా క‌రోనాతో విలవిలలాడిపోతోంది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన దేశాల్లో అమెరికా ముందుంది. ఏ దేశంలో లేని విధంగా రికార్డు స్థాయిలో  కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఎంతలా అంటే అక్క‌డ ప‌రిస్థితి భ‌యాన‌కంగా ఉంది. గుట్టలు గుట్టలుగా శవాలు, సామూహిక దహనాలు, ఆస్పత్రులు చాలడం లేదు. వైద్యులు తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. కంటికి కనిపించని శత్రువు ఆ దేశాన్ని మింగేస్తోంది.  యూరప్‌లోని స్పెయిన్, ఇటలీల కంటే న్యూయార్క్‌ పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. మార్చి 1న తొలి కేసు నమోదైన దగ్గర్నుంచి నెల రోజుల్లోనే వైరస్‌ ధాటికి అమెరికా కకావికలమైపోతోంది. 


logo