శనివారం 30 మే 2020
International - Apr 13, 2020 , 22:44:47

ర‌ష్యాలో విజృంభిస్తోన్న క‌రోనా

ర‌ష్యాలో విజృంభిస్తోన్న క‌రోనా

మాస్కో: ర‌ష్యాలో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రిస్తోంది. రోజురోజుకి కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గ‌త రెండు మూడు రోజుల నుంచి కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఇవాళ‌ ఒక్కరోజే 2,558 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ఈ దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఇంతమందికి ఒక్కరోజులో వైరస్ బారిన పడటం ఇదే తొలిసారి. దీంతో రష్యాలో కరోనా కేసుల సంఖ్య 18,328కి చేరింది. వీరిలో 148 మంది మరణించారు.


logo