మంగళవారం 26 మే 2020
International - Apr 03, 2020 , 11:15:25

కరోనా పెళ్లి: బంధుమిత్రుల కట్ఔట్ల సమక్షంలో..

కరోనా పెళ్లి: బంధుమిత్రుల కట్ఔట్ల సమక్షంలో..

హైదరాబాద్: అసలే కరోనా రోజులివి. అందుకే ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా ఆ జంట పెళ్లి చేసుకోవాలనుకున్నారు. బంధుమిత్రులు వస్తే కరోనా వ్యాపించే ప్రమాదముందని వారు ఓ సరికొత్త ఐడియా వేశారు. అమెరికాలోని మిషిగాన్ కు చెందిన అమీ సిమ్సన్, డాన్ స్టుగ్లిక్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఏప్రిల్ 4 శనివారం ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కానీ బంధుమిత్రులే ఉండరు ఆ పెళ్లిలో. సీట్లలో కేవలం కార్డ్‌బోర్డ్ కటౌట్లు మాత్రమే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నట్టుగానే మిషిగాన్ లోనూ లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయి. సీట్లు మరీ బోసిపోతాయని ఓ ప్యాకేజింగ్ కంపెనీవారు ఈ పెళ్లికి ఉచితంగా కటౌట్లు విరాళంగా ఇచ్చింది. బంధుమిత్రులు కూర్చోవాల్సిన సీట్లలో ఈ కటౌట్లు అలరారుతాయన్నమాట. పెళ్లి కొడుకు స్టుగ్లిక్ ఏదో మామూలు బొమ్మల్లాంటివి కట్ఔట్ చేసి ఇవ్వమని అడిగితే కంపెనీవారు మరోలా ఆలోచించారు. అన్నీ ఒకేరకంగా ఉంటే ఏం బాగుంటుంది? అందుకని పిల్లలు, పెద్దలు, పొడుగువ జడలు, పొట్టిజడలు, జులపాలు, అంటకత్తెర ఇలా రకరకాల బొమ్మలు చేసి ఇచ్చారు. అదీ సంగతి.


logo