శనివారం 04 ఏప్రిల్ 2020
International - Mar 06, 2020 , 13:37:28

అమెరికాలో క‌రోనా కిట్ల కొర‌త‌..

అమెరికాలో క‌రోనా కిట్ల కొర‌త‌..

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ గురించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు త‌మ ద‌గ్గ‌ర కావాల్సిన‌న్ని కిట్లు లేవ‌ని వైట్‌హౌజ్ వెల్ల‌డించింది. అమెరికాలో క‌రోనా వైర‌స్ సోకిన వ్య‌క్తులు సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న‌ది.  వారంలోగా ప‌దిల‌క్ష‌ల టెస్టింగ్ కిట్ల‌ను అందివ్వ‌డం వీలుకాదు అని ఉపాధ్య‌క్షుడు మైక్ పెన్స్ తెలిపారు.  ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలో క‌రోనా వ‌ల్ల  చ‌నిపోయిన వారి సంఖ్య 12కు చేరుకున్న‌ది.  మ‌హ‌మ్మారి క‌రోనాకు నియంత్రించేందుకు ఆ దేశ ఉభ‌య‌స‌భ‌లు .. మెడిక‌ల్ ఎయిడ్ కోసం ఎమ‌ర్జెన్సీ నిధుల‌ను రిలీజ్ చేసింది.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా వైర‌స్ సోకిన వారి సంఖ్య 92 వేల‌కు చేరుకున్న‌ది. చైనాలోనే 80 వేలు దాటింది. ప్ర‌పంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య 3200 దాటింది.  ఇట‌లీలో వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 148కి చేరుకున్న‌ది. ఇండియాలో వైర‌స్ సోకిన వారి సంఖ్య 30ని చేరుకున్న‌ది. ద‌క్షిన కొరియాలో మ‌ర‌ణించిన వారి సంఖ్య 42కు చేరుకున్న‌ది. చైనా క‌న్నా 17 రేట్ల అధిక వేగంతో ఇత‌ర దేశాల్లో క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. అమెరికాలోని సియాటెల్‌లో కొత్త‌గా 20 కేసులు న‌మోదు అయ్యాయి. రోడ్ ఐలాండ్‌లో సుమారు 200 మందిని క్వారెంటైన్ చేశారు. 


   


logo