సోమవారం 01 జూన్ 2020
International - Apr 18, 2020 , 22:02:57

ఆ వైర‌స్ మాది కాదు.. మౌనం వీడిన వుహాన్ ల్యాబ‌రేట‌రీ

ఆ వైర‌స్ మాది కాదు.. మౌనం వీడిన వుహాన్ ల్యాబ‌రేట‌రీ

హైద‌రాబాద్‌: నోవ‌ల్ క‌రోనా వైర‌స్‌.. వుహాన్‌లోని వైరాల‌జీ ల్యాబ్ నుంచి వ్యాప్తి చెందిన‌ట్లు అమెరికా ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వుహాన్ ల్యాబ్ తొలిసారి మౌనం వీడింది.  ఆ వైర‌స్ మా నుంచి రాలేద‌ని వుహాన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ వైస్‌ డైర‌క్ట‌ర్ యువాన్ జిమింగ్ తెలిపారు.  వుహాన్ ఇన్సిటిట్యూఫ్ ఆఫ్ వైరాల‌జీలో రీస‌ర్చ‌ర్‌గా,  వుహాన్ నేష‌న‌ల్ బ‌యోసేఫ్టీ ల్యాబ‌రేట‌రీలో డైరక్ట‌ర్‌గా జిమింగ్‌ చేస్తున్నారు. వుహాన్ ల్యాబ్ నుంచే వైర‌స్ వ‌చ్చింద‌న్న పుకార్ల‌ను కుట్ర ప్ర‌కారం క్రియేట్ చేశార‌ని ఆ ల్యాబ్ డైర‌క్ట‌ర్ తెలిపారు.  కేవ‌లం ప్ర‌జ‌ల్ని అయోమ‌యంలో ప‌డేసేందుకు ఈ ప‌న్నాగం వేశార‌న్నారు.  ఇది ఎంత మాత్రం మ‌నిషి త‌యారు చేసిన వైర‌స్ కాద‌న్నారు. అయితే ఈ వైర‌స్ గురించి ప‌బ్లిక్‌గా మాట్లాడిన ల్యాబ్‌కు చెందిన‌ తొలి వ్య‌క్తి జిమింగ్ మాత్ర‌మే.

ఫ్రాన్స్‌, డెన్మార్క్‌, యూఎస్‌లో అనేక సంవ‌త్స‌రాల పాటు యువాన్‌.. మైక్రోబ‌యాల‌జీ, బ‌యోటెక్నాల‌జీ రంగాల్లో ప‌నిచేశారు.  వైర‌ల్ స్ట‌డీ జ‌రుగుతున్న‌ప్పుడు, ఇన్స్‌టిట్యూట్‌లో ఎటువంటి వైర‌స్‌ను ప‌రీక్షిస్తున్నారు, శ్యాంపిల్స్ ఏ ర‌కంగా ఉంటాయో అంద‌రికీ ముందే తెలుస్తుంద‌న్నారు.  మా ద‌గ్గ‌ర ఉన్న ప‌రిశోధ‌న‌శాలల్లో క‌ఠిన‌మైన ఆంక్ష‌లు ఉంటాయ‌ని, రీస‌ర్చ్ నియ‌మావ‌ళి ఉంటుంద‌ని, అందుకే మేం పూర్తి విశ్వాసంతో ఉన్నామ‌న్నారు. 

వుహాన్ ల్యాబ్‌లో గ‌బ్బిలాల నుంచి వ‌స్తున్న వైర‌స్‌ల గురించి స్ట‌డీ జ‌రుగుతున్న‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు ముందే గుర్తించాయి. దీంతో ఆ ల్యాబ్‌పై అనుమానాలు ఎక్కువ‌య్యాయి.  ల్యాబ్‌లో ఉన్న ఓ విద్యార్థి నుంచి వైర‌స్ బ‌య‌ట‌కు ప్ర‌బ‌లిన‌ట్లు అమెరికా త‌న క‌థ‌నాల్లో ఆరోపిస్తున్న‌ది. అయితే త‌మ విద్యార్థుల్లో ఎవ‌రికీ వైర‌స్ సోక‌లేద‌ని యువాన్ తెలిపారు.  చాలా ప్ర‌దేశాల్లో అధ్య‌య‌నం జ‌రుగుతున్న‌ది, కొన్ని చోట్ల వ్యాక్సిన్ గురించి, కొన్ని చోట్ల ప్యాథోజెన‌సిస్ స్ట‌డీలు జ‌రుగుతున్నాయ‌ని, దీంతో ల్యాబ్‌కు సంబంధించి ఎంత మంది స్కాల‌ర్స్ ఉన్నార‌న్న విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్ప‌లేమ‌న్నారు. కొంద‌రు ప‌రిశోధ‌కులు వైర‌స్ స్ట్ర‌క్చ‌ర్ మీదు, కొంద‌రు ఇమ్యూనిటీ మీద ప‌నిచేస్తున్నారన్నారు.

వుహాన్ ల్యాబ్ నుంచి వైర‌స్ లీకైన‌ట్లు వ‌చ్చిన వార్త‌లను యువాన్ ఖండించారు. మా ల్యాబ్‌పై ఎందుకు రూమ‌ర్స్ వ‌స్తున్నాయంటే,,  కొంద‌రు కావాల‌నే ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ‌ప‌ట్టిస్తున్నార‌న్నారు.. అమెరికా ప‌త్రిక‌లు, నేత‌లు అదే ప‌నిచేస్తున్నార‌న్నారని ఆయ‌న ఆరోపించారు. కేవ‌లం నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌న్నారు.  వ‌దంతులు పుట్టిస్తున్న‌ వాళ్లు త‌మ ల‌క్ష్యాన్ని చేరుకోవ‌చ్చు.. కానీ మేం సైంటిఫిక్ మేనేజ్మెంట్‌తో ప‌నిచేస్తున్నామ‌ని యువాన్ తెలిపారు. 

వైర‌స్‌ను మ‌నిషి త‌యారు చేశారన్న క‌థ‌నాల‌పై స్పందిస్తూ.. అది మాన‌వీతీతం అన్నారు. క‌రోనా వైర‌స్‌ల‌ను సృష్టించ‌డం అంటే అది బిహాండ్ హ్యూమ‌న్ ఇంటెలిజెన్స్ అని యువాన్ అన్నారు. ఇలాంటి టెక్నాల‌జీ కూడా లేద‌న్నారు.  వైర‌స్‌ను సింథ‌సైజ్ చేయ‌డం అసాధ్య‌మే అన్నారు. త‌మ‌కు క‌రోనా గురించి తెలియ‌గానే,  డ‌బ్ల్యూహెచ్‌వోతో దాని జీనోమ్ సీక్వెన్స్ పంచుకున్నామ‌న్నారు. యూరోప్, అమెరికా లాంటి దేశాల్లో ఉన్న బీఎస్ఎల్ ల్యాబ్‌ల త‌ర‌హాలోనే వుహాన్ ల్యాబ్స్ ఉన్నాయ‌న్నారు.
logo