సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Mar 03, 2020 , 17:35:54

క‌రోనా కాటు.. వుహాన్‌లో మ‌రో డాక్ట‌ర్ మృతి

క‌రోనా కాటు..   వుహాన్‌లో  మ‌రో డాక్ట‌ర్ మృతి

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్‌కు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ న‌గ‌రంలో మ‌రో డాక్ట‌ర్ ప్రాణాలు కోల్పోయాడు.  వుహాన్ సెంట్ర‌ల్ హాస్పిట‌ల్‌లో ఆప్తామాల‌జీ శాఖ‌లో డిప్యూటీ డైర‌క్ట‌ర్‌గా చేస్తున్న మియా జాంగ్‌మింగ్ అనే డాక్ట‌ర్ ఇవాళ మ‌ర‌ణించాడు.  క‌రోనాతో పోరాటం చేస్తూ ఆయ‌న ప్రాణాలు విడిచిన‌ట్లు పేర్కొన్నారు.  ఆ డాక్ట‌ర్ వ‌య‌సు 57 ఏళ్లు.  ఇటీవ‌ల మ‌ర‌ణించిన డాక్ట‌ర్ లీ వెన్‌లియాంగ్‌కు స్నేహితుడే డాక్ట‌ర్ జాంగ్‌మింగ్‌.  వుహాన్ సెంట్ర‌ల్ హాస్ప‌ట‌ల్లో.. క‌రోనాతో యుద్ధం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన మూడ‌వ డాక్ట‌ర్‌గా మియా నిలిచాడు. క‌రోనా నియంత్ర‌ణ కోసం వైద్య సిబ్బంది నిరంతరం శ్ర‌మిస్తున్న‌ది.  ప్ర‌త్యేక మాస్క్‌ల ద్వారా పేషెంట్ల‌కు చికిత్స‌ను అందిస్తున్నారు. మ‌రో వైపు బీజింగ్‌లో కొత్త ఆదేశాలు జారీ చేశారు. కొరియా, ఇట‌లీ, ఇరాన్‌, జ‌పాన్ దేశాల నుంచి వ‌చ్చే వారికి 14 రోజుల పాటు క్వ‌రెంటైన్‌కు పంప‌నున్నారు. logo