గురువారం 02 ఏప్రిల్ 2020
International - Feb 18, 2020 , 08:21:55

1868కి చేరుకున్న క‌రోనా మృతుల సంఖ్య‌

1868కి చేరుకున్న క‌రోనా మృతుల సంఖ్య‌

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ వ‌ల్ల చైనాలో మృతిచెందిన వారి సంఖ్య 1868కి చేరుకున్న‌ది. కోవిడ్‌-19 వ్యాధి రోజు రోజుకూ విస్త‌రిస్తున్న‌ది. క‌రోనా వైర‌స్ సోకిన వారిలో సుమారు 12వేల మంది పేషెంట్లు కోలుకున్న‌ట్లు అధికారులు చెప్పారు. చైనాలో దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 72వేల 436 కేసులు న‌మోదు అయ్యాయి. దీంట్లో 11 వేల మంది ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.  క‌రోనా కేంద్ర బిందువైన హుబేయ్ ప్రావిన్సులోనే అత్య‌ధిక మ‌ర‌ణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ ప్రావిన్సులో చాలా వ‌ర‌కు ప్రాంతాల‌ను క్వారెంటైన్ చేశారు. దిగ్భంధం వ‌ల్ల ల‌క్ష‌లాది సంఖ్య‌లో జ‌నం ఎటు వెళ్ల‌కుండా ఉండిపోయారు.  అయితే హుబేయ్ ప్రావిన్సు మిన‌హా మిగితా దేశంలో క‌రోనా కేసుల సంఖ్య రోజువారీగా త‌గ్గుతున్న‌ట్లు జాతీయ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది. 


logo