బుధవారం 03 జూన్ 2020
International - Apr 20, 2020 , 14:24:54

ఫ్రాన్స్ ను హ‌డ‌లెత్తిస్తున్న న‌దీ జ‌లాలు

ఫ్రాన్స్ ను హ‌డ‌లెత్తిస్తున్న న‌దీ జ‌లాలు

పారిస్: ఫ్రాన్స్‌ను క‌రోనా మ‌హ‌మ్మారి హ‌డ‌లెత్తిస్తుంది. ఇప్ప‌టికే 1,52,894 మందికి వైర‌స్ సోక‌గా..19,718 మంది క‌రోనాతో మృతిచెందారు. అయితే ఇప్పుడు ఫ్రాన్స్ ప్ర‌జ‌ల‌ను అక్క‌డి న‌దీ జ‌లాలు భ‌య‌పెడుతున్నాయి.  కరోనా వైరస్ జాడలు ఇప్పటి వరకు గాలి, ఇతర వస్తువుల ద్వారా వ్యాపిస్తుంటే.. ఫ్రాన్స్ దేశంలోని నదీ జలాల్లో వాటి జాడలు కన్పించడంతో అక్క‌డి జ‌నం బెంబెలెత్తిపోతున్నారు. అయితే ఈ జలాలను తాగడానికి కాకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్న‌ట్లు అక్క‌డి ప్ర‌భుత్వం తెలిపింది. ఏదీ ఏమైనా జలాల్లో వైరస్ జాడలు స్వల్పంగా కన్పించడంతో అక్క‌డి వారు వ‌ణికిపోతున్నారు. 

పారిస్ నగరంలో ఉన్న 27 ప్రాంతాల నుంచి నీటి నమూనాలు వాటర్ అథారిటీ సేకిరించ‌గా.. నాలుగు ప్రాంతాల నుంచి సేకరించిన నీటిలో కరోనా వైరస్ స్వల్ప మోతాదులో కన్పించింది. దీంతో ఫ్రాన్స్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై చర్యలు ప్రారంభించింది. పారిస్ మీదుగా పయనించే సీన్ నది, ఓర్క్ కెనాల్ లోని నీటిలో మాత్రమే వైరస్ జాడలు వున్నాయని అంటున్నారు. అక్కడి నుంచే నగరంలోని ఉద్యానవనాలకు, వాటర్ ఫౌంటెన్ లకు నీరందిస్తున్నారు.ఈ నీటిని ఎటువంటి అవసరాలకు వినియోగించవద్దని పారిస్ నగర అధికారి సిలియా బ్లాయూల్ వెల్లడించారు. నగర వాసుల తాగునీటి అవసరాల నిమిత్తం సరఫరా చేస్తున్న నీరు పూర్తిగా స్వచ్ఛంగా ఉందని, ఆ నీటిని తాగవచ్చని తెలిపారు.logo