శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 14, 2020 , 19:41:00

20 ల‌క్ష‌ల చేరువ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు..

20 ల‌క్ష‌ల చేరువ‌లో క‌రోనా పాజిటివ్ కేసులు..హైద‌రాబాద్‌: క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య మ‌రో మైలురాయిని చేరుకోబోతున్న‌ది. ప్రపంచ‌వ్యాప్తంగా ఆ వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 20 ల‌క్ష‌ల‌కు తాక‌నున్న‌ది.  ప్ర‌స్తుతం జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ లెక్క‌ల ప్ర‌కారం.. 19 ల‌క్ష‌ల 29 వేల మందికి వైర‌స్ సోకింది.  భార‌త్‌, ఫ్రాన్స్ దేశాలు ఇవాళ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశాయి. ఫ్రాన్స్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 15వేల మంది మ‌ర‌ణించారు. బ్రిట‌న్‌లో ప్ర‌ధాని బోరిస్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కానీ ఆ దేశంలో మృతుల సంఖ్య 11 వేలు దాటింది. అయితే లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఒక్క‌సారిగా ఎత్తివేయ‌రాదు అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. నిదానంగా, పూర్తి కంట్రోల్‌తో ఆ చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్న‌ది.  క‌రోనా కేసులు పెరిగినంత వేగంగా.. ఆ వైర‌స్ కేసులు త‌గ్గ‌వ‌ని, అందుకే ఆంక్ష‌ల‌ను నిదానంగా స‌డలించాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో డైర‌క్ట‌ర్ టెడ్రోస్ తెలిపారు. జాన్స్ హాప్కిన్స్ ప్ర‌కారం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్షా 20 వేల మంది క‌రోనా వ‌ల్ల మృతిచెందారు.logo