ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్

బీజింగ్ : తూర్పు చైనాలోని ఓ కంపెనీ తయారు చేసిన ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్‌ను గుర్తించారు. దీంతో ఆ కంపెనీని ప్రభుత్వం సీజ్ చేసింది. బీజింగ్ పక్కనే ఉన్న టియాంజిన్‌లోని డాకియాడో ఫుడ్ కో. లిమిటెడ్ కంపెనీ ఐస్‌క్రీమ్‌ను ఉత్పత్తి చేసింది. అందులో పని చేస్తున్న సిబ్బందికి కరోనా వైరస్ పరీక్షలు చేస్తున్నట్లు నగర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు వెయ్యి మందిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే ఆ బ్యాచ్‌కు చెందిన బాక్స్‌లను గుర్తిస్తున్నామని, అయితే ఐస్‌క్రీమ్‌తో ఎవరు మహమ్మారిన బారినపడ్డట్లు సమాచారం లేదని పేర్కొంది. వైరస్ గుర్తించిన బ్యాచ్‌లో సదరు కంపెనీ 29వేల బాక్స్‌లు ఇంకా విక్రయించలేదని, టియాంజిన్‌లో 390 మందికి విక్రయించగా.. వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. అలాగే ఇతర ప్రాంతాలకు ఐస్‌క్రీమ్ విక్రయాలు సాగినట్లు ప్రకటనలో పేర్కొంది. ఐస్‌క్రీమ్‌లో వినియోగించిన పాలపొడి న్యూజీలాండ్, ఉక్రెయిన్‌లో తయారైంది. 2019 చివరలో సెంట్రల్ సిటీ వుహాన్‌లో కొవిడ్ వైరస్‌ను చైనా గుర్తించింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న చేపలు, ఇతర ఆహార పదార్థాల్లో వైరస్ ఉండవచ్చని చైనా పేర్కొన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
- ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న వండర్ వుమన్
- దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు
- టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశాం : మంత్రి ఈటల రాజేందర్
- ప్రియా వారియర్‌కు బ్యాడ్ టైం..వర్కవుట్ కాని గ్లామర్ షో
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు
- ట్రక్కు బోల్తా.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు
- ఎల్లో డ్రెస్‌లో అదరగొడుతున్న అందాల శ్రీముఖి..!
- లారీని ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం