బుధవారం 03 జూన్ 2020
International - May 14, 2020 , 12:11:28

అమెరికాలో చిన్న వ్యాపారాల‌పై పెద్ద‌ దెబ్బ

అమెరికాలో చిన్న వ్యాపారాల‌పై పెద్ద‌ దెబ్బ

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి గ‌త రెండు నెల‌లుగా ప్ర‌పంచ దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. అగ్ర‌రాజ్యం అమెరికాలోనైతే క‌రోనా ర‌క్క‌సి విల‌య‌తాండ‌వ‌మే చేస్తున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 14 ల‌క్ష‌ల మందికిపైగా అమెరిక‌న్లపై క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం చూపింది. మ‌రో 85 వేల మందికిపైగా అమెరిక‌న్ల‌ను పొట్ట‌న పెట్టుకుంది. అంతేకాదు, అక్క‌డి ఆర్థిక వ్య‌వ‌స్థపైనా క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపింది. ముఖ్యంగా చిరు వ్యాపారాలు చితికిపోయాయి. 

ఇటీవ‌ల నిర్వ‌హించిన ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం..  క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా గ‌త మార్చి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలో ఒక ల‌క్ష‌కు పైగా చిన్నచిన్న వ్యాపార సంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. ఆయా సంస్థ‌ల‌పై ఆధార‌ప‌డి బ‌తుకున్న ల‌క్ష‌ల మంది జీవితాలు దుర్భ‌రంగా మారాయి. మే 9 నుంచి 11 తేదీల మ‌ధ్య యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌, హార్వ‌ర్డ్ బిజినెస్ స్కూల్‌, హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, యూనివ‌ర్సిటీ ఆఫ్ చికాగోల‌కు చెందిన ప‌లువురు ఆర్థిక‌వేత్త‌లు క‌లిసి ఈ అధ్య‌య‌నం చేశారు. దీని ప్ర‌కారం అమెరికాలోని మొత్తం చిరు వ్యాపార సంస్థ‌ల్లో రెండు శాతం పూర్తిగా మూత‌ప‌డిపోయాయ‌ని తేలింది.   ‌    


logo