గురువారం 28 మే 2020
International - May 14, 2020 , 14:00:02

3 ల‌క్ష‌ల చేరువ‌లో క‌రోనా మృతులు

3 ల‌క్ష‌ల చేరువ‌లో క‌రోనా మృతులు

హైద‌రాబాద్‌: ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ సృష్టిస్తున్న విల‌యం అంతా ఇంతా కాదు. ఆ మ‌హ‌మ్మారి రోజు రోజుకూ మ‌రింత ఉగ్రంగా మారుతున్న‌ది.  ఆ వైర‌స్ వ‌ల్ల  మృతిచెందిన వారి సంఖ్య మూడు ల‌క్ష‌ల‌కు చేరువ అవుతున్న‌ది.  ఇప్ప‌టి వ‌ర‌కు ఆ వైర‌స్ వ‌ల్ల 2,97,251 మంది మృతిచెందిన‌ట్లు జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ పేర్కొన్న‌ది.  ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌స్ బారిన ప‌డ్డ వారి సంఖ్య 4 ల‌క్ష‌ల 35 వేలు దాటింది.  వైర‌స్ వ‌ల్ల అమెరికాలో 84,136 మంది, బ్రిట‌న్‌లో 33,264 మంది, ఇట‌లీలో 31,106 మంది,  స్పెయిన్‌లో 27,104 మంది, ఫ్రాన్స్‌లో 27,077 మంది, బ్రెజిల్‌లో 13,240 మంది మ‌ర‌ణించారు. ఒక‌వైపు మ‌ర‌ణాల సంఖ్య పెరుగుతున్నా.. చాలా వ‌ర‌కు దేశాలు లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్నాయి.


logo