గురువారం 02 ఏప్రిల్ 2020
International - Feb 04, 2020 , 15:30:47

క‌రోనా మృతులు 425

క‌రోనా మృతులు 425

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ‌ల్ల చైనాలో మృతిచెందిన వారి సంఖ్య 425కు చేరుకున్న‌ది. ప్రాణాంత‌క వైర‌స్ సోకిన కేసులు 20 వేలు దాటాయి. వుహాన్‌లో కొత్తగా నిర్మించిన హాస్ప‌ట‌ల్‌లో సేవ‌లు త్వ‌ర‌లో ప్రారంభం కానున్నాయి.  విష‌పూరితంగా ప్ర‌బ‌లుతున్న వైర‌స్‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌జాయుద్ధాన్ని మొద‌లుపెట్టామ‌ని అధ్య‌క్షుడు జిన్‌పింగ్ తెలిపారు. పిలిప్పీన్స్‌, హాంగ్‌కాంగ్‌లో కూడా క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. హాంగ్‌కాంగ్‌లో 39 ఏళ్ల వ్య‌క్తి క‌రోనా వ‌ల్ల మృతిచెందాడు. క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణలో కొన్ని లోపాలు త‌లెత్తిన‌ట్లు చైనా అత్యున్న‌త స్థాయి అధికారులు అంగీక‌రించారు. ఎమ‌ర్జెన్సీ మేనేజ్‌మెంట్ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌టిష్టం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పోలిట్‌బ్యూరో స్టాండింగ్ క‌మిటీ పేర్కొన్న‌ది.  కరోనా వైర‌స్ ముప్పు పొంచి ఉంద‌ని వుహాన్ సిటీకి చెందిన ఓ డాక్ట‌ర్ ముందే వార్నింగ్ ఇచ్చారు. కానీ అత‌ను ప‌నిచేస్తున్న హాస్ప‌ట‌ల్ యాజ‌మాన్యం అత‌ని గొంతు నొక్కేసిన‌ట్లు తేలింది. త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాడ‌ని అత‌నిపై పోలీసు కేసు పెట్టారు.  ఇప్పుడు వైర‌స్ వ్యాప్తి కావ‌డంతో చైనా అధికారులు దిద్దుబాటు చ‌ర్య‌లు మొద‌లుపెట్టారు.  చైనా మిన‌హా మిగితా దేశాల్లో ఇప్ప‌టివ‌ర‌కు 150 క‌రోనా కేసులు న‌మోదు అయిన‌ట్లు తేలింది. logo