సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 12, 2020 , 16:50:52

‘కరోనా వైరస్‌ కణాలు గంటకుపైగా గాలిలో ఉంటాయి’

‘కరోనా వైరస్‌ కణాలు గంటకుపైగా గాలిలో ఉంటాయి’

లండన్‌ : కరోనా వైరస్ కణాలు గంటకు పైగా గాలిలో అంటువ్యాధులుగా ఉండగలవని లండన్‌లోని ఇంపీరియల్ కళాశాల ఇన్ఫ్లుఎంజా వైరాలజీ ఛైర్ పర్సన్‌ ప్రొఫెసర్ వెండీ బార్క్లే అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల తెలిపిన విధంగా గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుండనడానికి సాక్ష్యాలు ఉన్నాయని ఆమె చెప్పారు. 

ప్రొఫెసర్ బార్క్లే ఆదివారం బీబీసీతో మాట్లాడుతూ ఈ వ్యాధి వ్యాప్తికి గాలి కూడా దోహదం చేస్తుందని డబ్ల్యూహెచ్‌ఓ తెలుపడం ఇదే తొలిసారి అన్నారు. వాస్తవానికి వైరస్‌ వ్యాప్తి చెందడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నప్పటికీ, గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఈ పరిస్థితి ప్రస్తుతం కలవరపెడుతోందన్నారు. ఈ వైరస్ గాలిలో నిలిపివేయబడి, వాటిని పీల్చుకునే వ్యక్తి నుంచి కొంత దూరం ప్రయాణించవచ్చని, ఒక గంటకు పైగా గాలిలో అంటువ్యాధిగా ఉండవచ్చునని ప్రయోగశాల అధ్యయనాలు తెలిపినట్లు బార్క్లే అన్నారు. 

ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ మాదిరిగా గాలిని పునర్వినియోగం చేయకుండా, ఒక గదిలో గాలి వస్తూ పోతుండేలా చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే అవకాశం ఉందన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo