శనివారం 11 జూలై 2020
International - Jun 29, 2020 , 09:39:47

టెక్సాస్‌లో విజృంభిస్తున్న క‌రోనా వైర‌స్ కేసులు

టెక్సాస్‌లో విజృంభిస్తున్న క‌రోనా వైర‌స్ కేసులు

హైద‌రాబాద్‌: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కేసులు అత్య‌ధిక స్థాయిలో న‌మోదు అవుతున్నాయి.  వైర‌స్ వ్యాప్తి ప్ర‌మాద‌క‌ర మ‌లుపు తీసుకున్న‌ట్లు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గ్రెగ్ అబ్బాట్ హెచ్చ‌రించారు. గ‌త వారం రోజుల్లో స‌గ‌టున వైర‌స్ కేసులు 2000 నుంచి 5000 దాటిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ పేర్కొన్నారు.  అమెరికాలో లాక్‌డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత ద‌క్షిణ‌, ప‌శ్చిమ రాష్ట్రాల్లో మ‌ళ్లీ వైర‌స్ కేసులు అధికం అవుతున్నాయి. ఆ దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2.5 మిలియ‌న్లు దాటింది.  దాదాపు ల‌క్షా 25 వేల మంది వైర‌స్ వ‌ల్ల చ‌నిపోయారు.  

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ‌ల్ల 5 ల‌క్ష‌ల మంది చ‌నిపోయిన‌ట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ పేర్కొన్న‌ది. అయితే తాజాగా వైర‌స్ కేసులు అధికం కావ‌డంతో టెక్సాస్‌, ఫ్లోరిడాతో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో క‌ఠిన‌త‌ర ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్నారు.  హాస్పిట‌ళ్లు శ‌ర‌వేగంగా నిండిపోయే ప్ర‌మాదం ఉన్న‌ట్లు హెచ్చ‌రిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే దాదాపు 5 వేల మంది హాస్పిట‌ళ్ల‌లో అడ్మిట్ అయిన‌ట్లు టెక్సాస్ గ‌వ‌ర్న‌ర్ అబ్బాట్ తెలిపారు.logo