మంగళవారం 31 మార్చి 2020
International - Feb 29, 2020 , 10:16:00

ద‌క్షిణకొరియాలో ఒక్క రోజే 594 క‌రోనా కేసులు

ద‌క్షిణకొరియాలో ఒక్క రోజే 594 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: కరోనా వైర‌స్ ద‌క్షిణ‌కొరియాలోనూ వ‌ణుకుపుట్టిస్తోంది. ఆ దేశంలో శుక్ర‌వారం ఒక్క రోజే కొత్త‌గా 594 కేసులు న‌మోదు అయ్యాయి.  ఒకే రోజులో ఇంత అత్య‌ధిక సంఖ్య‌లో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి.  దీంతో ఆ దేశంలో క‌రోనా సోకిన కేసులు 2931కి చేరుకున్న‌ది.  ద‌క్షిణ‌ కొరియాలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల 16 మంది మృతిచెందారు.   చైనా త‌ర్వాత అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోదైన దేశంగా ద‌క్షిణ‌కొరియా నిలిచింది.  జ‌పాన్‌లోనూ క‌రోనా వైర‌స్ వ‌ల్ల 11 మంది మృతిచెందారు.  ఇక చైనాలో ఈ వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 2835కు చేరుకున్న‌ది.  ఆ దేశంలో 80 వేల మందికి క‌రోనా సోకింది. logo
>>>>>>