ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 20, 2020 , 16:47:27

ద‌క్షిణ కొరియాలో మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా

ద‌క్షిణ కొరియాలో మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా

హైద‌రాబాద్‌: ద‌క్షిణ కొరియాలో క‌రోనా వైర‌స్ కేసులు మ‌ళ్లీ విజృంభిస్తున్నాయి. తాజాగా ఆ దేశంలో 288 కేసులు న‌మోదు అయ్యాయి. దేశ రాజ‌ధాని సియోల్‌లో వైర‌స్ మ‌ళ్లీ పంజా విసిరిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌వేళ కేసులు మ‌ళ్లీ పెరిగితే, అది తీవ్ర రూపం దాల్చే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆరోగ్య మంత్రి కిమ్ గాంగ్‌లిప్ తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్ స‌రిగా లేకుంటే... అమెరికా, యూరోప్ త‌ర‌హాలో కేసులు బ‌య‌ట‌ప‌డుతాయ‌ని కొరియా అంటువ్యాధుల సంస్థ డైర‌క్ట‌ర్ కువాన్ తెలిపారు. సారంగ్ జీల్ చ‌ర్చి నుంచి ఎక్కువ శాతం కేసులు కాంటాక్ట్ అయిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో షిన్‌చియాన్‌జీ చ‌ర్చి కూడా క‌రోనా వైర‌స్ కేసుల‌కు కేంద్ర బిందువుగా నిలిచింది. వాస్త‌వానికి మొద‌ట్లో క‌రోనాకు హాట్‌స్పాట్‌గా ద‌క్షిణ కొరియా ఉన్న‌ది. కానీ ప‌క‌డ్బందీగా జ‌రిగిన ట్రేసింగ్‌, టెస్టింగ్‌ల‌తో కేసుల‌ను త‌గ్గించారు. ఇప్పుడు మ‌ళ్లీ కేసులు పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ ప్ర‌కారం.. ద‌క్షిణ కొరియాలో ఇప్ప‌టి వ‌ర‌కు 16 వేల కేసులు న‌మోదు అయ్యాయి. 307 మంది మ‌ర‌ణించారు. 

 


logo