శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 04, 2020 , 22:13:56

100 కోట్ల మంది విద్యార్థుల‌పై క‌రోనా ప్ర‌భావం: ఐక్య‌రాజ్య‌స‌మితి

100 కోట్ల మంది విద్యార్థుల‌పై క‌రోనా ప్ర‌భావం: ఐక్య‌రాజ్య‌స‌మితి

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతున్న‌ద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి పేర్కొన్న‌ది. క‌రోనా వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల భవితవ్యంపై కూడా ప్రభావం చూపిందని ఐరాస అభిప్రాయ‌ప‌డింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా సుమారు 160 దేశాల్లో స్కూళ్లను మూసేశారని, ఈ స్కూళ్ల మూసివేత‌తో క‌నీసం 100 కోట్లమంది విద్యార్థులపై ప్రభావం ప‌డింద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు. 

అదేవిధంగా నాలుగు కోట్ల మందికిపైగా పిల్లలు ప్రీ-స్కూల్ విద్యను మిస్ అయ్యారని గుటెర్ర‌స్‌ చెప్పారు. క‌రోనా వైర‌స్ వ‌ల్ల మానవ మేధస్సు చాలా నష్టపోయిందని, ఈ తరం గొప్ప విపత్తును ఎదుర్కొన్నట్లు  అయ్యింద‌ని,  దీనివల్ల మానవుల ప్రగతి దెబ్బతిన్నట్లేన‌ని గుటెరస్ పేర్కొన్నారు.    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo