ఐరోపాలో నేటి నుంచి కరోనా వ్యాక్సినేషన్

లండన్: ఐరోపా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు రంగం సిద్ధమయ్యింది. యూరోపియన్ యూనియ న్లోని వివిధ దేశాల్లో నేటి నుంచి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించనున్నారు. ఫైజర్-బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన టీకాలు ఐరోపా దేశాలకు చేరాయి. శుక్ర, శనివారాల్లో నిర్ధేశించిన కేంద్రాలకు టీకాలు చేరుకోగా, నేడు మరికొన్ని ప్రాంతాలకు తరలించనున్నారు. 60 ఏండ్లకు పైబడినవారికి టీకా ఇచ్చేందుకు రష్యా ప్రభుత్వం అనుమతించింది. దేశంలో ఇప్పటికే దాదాపు 2 లక్షల మందికిపైగా టీకా పంపిణీ చేశారు. ప్రయోగ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రావడంతో అందరికీ అనుమతిస్తూ ఆ దేశ ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. స్పుత్నిక్-వీ టీకా ఎగుమతికి సంబంధించి ఇప్పటికే చాలా దేశాలతో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. అర్జెంటీనా, బెలారస్ దేశాలు స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను ఉపయోగానికి అనుమతించాయి.
కొత్తరకం కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు యూకేలో మరిన్ని ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉత్తర ఐర్లాండ్‌లోని వేల్స్లో ఆరువారాల పాటు లాక్డౌన్ విధించారు. అత్యవసర ప్రయాణాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలకు కూడా కొత్తరకం వైరస్ పాకింది. ఇంగ్లండ్ నుంచి ఫ్రాన్స్‌కి వెళ్లిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో అనేక దేశాలు ఇంగ్లండ్‌కు విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఆ దేశం నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారిని ఐసోలేషన్‌లో ఉంచుతున్నారు.
తాజావార్తలు
- బిగ్‌బాస్ టాలెంట్ మేనేజర్ దుర్మరణం
- 2,910 కరోనా కేసులు.. 52 మరణాలు
- మహిళలూ.. ఫైబర్ ఎక్కువ తినండి ఎందుకంటే..?
- గణతంత్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి : సీఎస్
- 116కు చేరిన బ్రిటన్ వేరియంట్ కరోనా కేసులు
- అంతర్రాష్ట్ర గజదొంగ బాకర్ అలీ అరెస్ట్
- జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు
- స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ రూ.1000 కోట్లు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?