శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 06, 2020 , 16:41:13

ఏప్రిల్ చివ‌రినాటికి క‌రోనా త‌గ్గుద‌ల‌: చైనా సైంటిస్ట్ ఝూంగ్ న‌న్షాన్‌

 ఏప్రిల్ చివ‌రినాటికి క‌రోనా త‌గ్గుద‌ల‌: చైనా సైంటిస్ట్ ఝూంగ్ న‌న్షాన్‌

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారి ఏప్రిల్ చివ‌రి నాటికి త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని చైనా శాస్త్ర‌వేత్త ఝూంగ్ న‌న్షాన్ అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకు చైనా, ఇట‌లీ ఘ‌ట‌న‌లే కార‌ణ‌మ‌ని చెప్పుకొచ్చారు. ఇట‌లీలో మొద‌ట‌గా వేగంగా విస్త‌రించిన క‌రోనా ఇప్పుడు పెరుగుద‌ల‌లో త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని చెప్పారు. ఇటలీ తర్వాత వ్యాపించిన అమెరికాలో... ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయ‌ని, రానున్న రోజుల్లోవాటి పెరుగుదలలో తగ్గుదల మొదలవుతుంద‌ని చెప్పారు. ఇక‌ అమెరికా తర్వాత కరోనా వ్యాపించిన ఇండియాలో ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతూ... ఏప్రిల్ చివరి నాటికి...  కంట్రోల్ అయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కాస్త అటూ ఇటుగా ఏప్రిల్‌ నెలాఖరుకల్లా  కంట్రోల్ అవుతుందని ఝాంగ్ నన్షాన్ అంచ‌నా వేస్తున్నారు. ఇక కరోనా వైరస్ నానాటికీ బలహీనం అవుతుంద‌ని..చైనాలో మ‌ళ్లీ విజృంభించే అవ‌కాశ‌మే లేద‌న్నారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలు చేప‌ట్టిన లాక్‌డౌన్ వైర‌స్ నియంత్ర‌ణ‌లో బాగా ప‌నిచేసింద‌ని పేర్కొన్నారు.


logo